శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (15:06 IST)

శెనగపిండి, నిమ్మరసం ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

పెరుగు పాల ఉత్పత్తులతోనే తయారవుతుంది. కనుక ఇది అందానికి, ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మెుటిమలు తొలగిపోవాలని చాలామంది రకరకాల క్రీములు వేసుకుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించదు. ముందున్న దానికంటే ఇంకా ఎక్కువగా మెుటిమలు, నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
 
పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్స్ ముఖాన్ని తాజాగా మార్చుతుంది. కనుక పెరుగులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొందరికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలు పడిపోతాయి. అందుకు ఇలా చేస్తే...
 
శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. దాంతో ముఖం మృదువుగా, తాజాగా మారుతుంది.