గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 14 జులై 2018 (10:58 IST)

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..?

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె సమపాళ్లు బౌల్‌లోకి తీసుకుని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడ

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె సమపాళ్లు బౌల్‌లోకి తీసుకుని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడంవల్ల పెరుగుకీ ఉసిరికీ ఉన్న బ్లీచ్‌ గుణాల కారణంగా ముఖంమీద ఉన్న మొటిమల మచ్చలూ ట్యాన్‌ అన్నీ పోతాయి. 
 
అలాగే టేబుల్‌స్పూను బియ్యప్పిండిలో టీస్పూను గంధంపొడి, అరటేబుల్‌స్పూను పాలపొడి, టేబుల్‌స్పూను సెనగపిండి, టేబుల్‌స్పూను రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసి మొహానికీ చేతులకీ పట్టించి పావుగంట తర్వాత కడిగేస్తే.. చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోయి, ముఖమూ చేతులూ మెరుస్తుంటాయి. 
 
ఇంకా తులసీ, వేపాకుల పేస్టుకు టీస్పూను పసుపూ అరటీస్పూను నిమ్మరసం కలిపి పట్టించి ఆరాక కడిగేస్తే ముఖంపై మచ్చలు మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.