శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (16:28 IST)

ఐఆర్‌సీటీసీలో కొత్త ఫీచర్.. ఇకపై ఖాళీ బెర్తులన్నీ ఆన్‌లైన్‌లోనే...

రైల్వే శాఖ అనుబంధ సంస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) వెబ్‌సైట్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్ ద్వారా ఇకపై రైలులో ఖాళీగా ఉన్న  వివరాలను ఆన్‌లైన్‌లోనే ఉంచనున్నారు. ఇది రైల్వే ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది. 
 
ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ప్ర‌యాణికులు తాము వెళ్లాల‌నుకునే ఫ్ర‌మ్‌, టు స్టేష‌న్ల వివ‌రాలు, తేదీ ఎంట‌ర్ చేసి కింద ఉండే చార్ట్స్/వెకెన్సీ ఆప్ష‌న్‌ను క్లిక్ చేస్తే ఓ విండో వస్తుంది. అందులో తాము ప్ర‌యాణం చేసే ట్రెయిన్ నంబ‌ర్‌, తేదీ, బోర్డింగ్ వివ‌రాల‌ను ఎంటర్ చేసి కింద ఉండే స‌బ్‌మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే మ‌రో విండో వ‌స్తుంది. 
 
అందులో ఆ ట్రెయిన్‌కు చెందిన అన్ని కోచ్‌లు నంబ‌ర్ల రూపంలో క‌నిపిస్తాయి. ఏదైనా కోచ్ నంబ‌ర్‌పై క్లిక్ చేస్తే కింది భాగంలో కోచ్‌లో ఉన్న అన్ని బెర్తుల నంబ‌ర్లు క‌నిపిస్తాయి. వాటిలో ఖాళీగా ఉన్న బెర్త్‌లు గ్రీన్ క‌ల‌ర్‌లో క‌నిపిస్తాయి. దీంతో ప్ర‌యాణికులు ఖాళీగా ఉన్న బెర్త్ నంబ‌ర్ల‌ను నోట్ చేసుకుని వాటిని టీటీఈకి చెబితే ఆయన ఆ బెర్తులను కేటాయిస్తారు. 
 
దీని వ‌ల్ల టీటీఈలు రైలులో బెర్తులు ఖాళీ లేవ‌ని చెప్ప‌డం ఇకపై కుదరదు. ఈ ప్రక్రియలో భాగంగా, రైలు ప్రారంభ‌మ‌య్యే ముందు, రెండు గంటలకు ముందు తయారు చేసిన చార్టులు రెండింటి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దీనివ‌ల్ల రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల వివ‌రాలు ప్ర‌యాణికులకు ఐఆర్‌సీటీసీ యాప్ లేదా సైట్‌లో సుల‌భంగా తెలుస్తాయి.