శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (16:50 IST)

ఏపీ ఈసెట్ ఫలితాలు వెల్లడి - 92.36 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్) పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించారు. ఈ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు. ఈ పరీక్షల్లో సరాసరి 92.36 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. 
 
ఈ ఫలితాలను cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొన్నారు. ఏపీ ఈసెట్‌ స్కోరు కార్డును ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ధేశిత విండోలో రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టిక్కెట్ నంబరు వివరాలను పొందుపరి, తమ స్కోరు కార్డును డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.