మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మే 2020 (14:57 IST)

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ -2008 అభ్యర్థులకు శుభవార్త.. ఏంటది?

Teachers
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ -2008 అభ్యర్థులకు శుభవార్త. 2008 బ్యాచ్‌లో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించి ఉద్యోగాలు రాని వారిని కాంట్రాక్టు విధానంలో సెకండరీగ్రేడ్‌ టీచర్లుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారు రాష్ట్రంలో మొత్తం 4657 మంది ఉండగా అందులో ప్రకాశం జిల్లాలో 250 మంది అభ్యర్థులు ఉన్నారు. 
 
డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు మొదట డీఈడీ అభ్యర్థులకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో మెరిట్‌ సాధించిన పలువురు డీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. 
 
దీంతో మెరిట్‌ సాధించిన పలువురు డీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అప్పటినుంచి ఉద్యోగాలకు వారు చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు అది ఫలించింది. వీరందరినీ కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులుగా నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.