JEE MAINS ఫలితాలు విడుదల : అదరగొట్టిన తెలుగు విద్యార్థులు
దేశంలో జాతీయ స్థాయిలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. దేశంలోనే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ సీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు రాసే పరీక్షలో నూటికి నూరు శాతం మార్కులతో పాస్ కావడం అంటే సాధారణ విషయం కాదు.
అయితే తాజాగా కోవిడ్ పరిస్థితులన్నింటినీ అధిగమించి జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్రం నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 7.09 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో వందకు 100 శాతం పర్సంటైల్‌తో 17 మంది సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
అయితే మొత్తం అభ్యర్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తాచాటారు. ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు వందకు వంద పర్సంటైల్ సాధించి అదరగొట్టారు. వీరి తర్వాత ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున, అలాగే బిహార్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరూ 100కు 100 పర్సంటైల్ సాధించారు.