మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:10 IST)

పాప్‌కార్న్ చికెన్ తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ ఫిల్లెట్ - 300 గ్రా
మొక్కజొన్నపిండి - 2 స్పూన్స్
గుడ్డు - 1
బ్రెడ్‌క్రంబ్స్, కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ (కచ్చాపచ్చాగా మిక్సీ చేసి)ల్లో వేటినైనా వాడొచ్చు - 1 కప్పు
ఉప్పు - సరిపడా
పసుపు - పావుస్పూన్
నూనె - సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ముప్పావు స్పూన్
నల్ల మిరియాలు - పావుస్పూన్
ఉల్లిపాయల పొడి - అరస్పూన్
గరం మసాలా - కొద్దిగా
కారం - అరస్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసి నీళ్లతో శుభ్రంగా కడిగి వడకట్టాలి. తరువాత కారం, నల్లమిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, ఉప్పును చికెన్ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్డు, మొక్కజొన్న పిండి వేసి ముక్కలన్నింటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆ తరువాత బ్రెడ్ క్రంబ్స్‌ను వేసి కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఒక్కో ముక్కను బ్రెడ్ క్రంబ్స్‌లో వేసి దొర్లించొచ్చు. పావుగంట వాటిని అలానే ఉంచితే బ్రెడ్ పొడి ముక్కలకు బాగా అంటుకుపోతుంది. ఇప్పుడు నూనె వేడిచేసి అందులో ఈ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. మధ్యమధ్యలో కదుపుతూ వేగిస్తే ముక్కలు బాగా వేగుతాయి. అంతే... పాప్‌కార్న్ చికెన్ రెడీ.