శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:04 IST)

బెండకాయల జిగురు పోవాలంటే..?

ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ కాయగూరలు తినాలి. కానీ, కొన్ని కాయగూరలు తినాలనుకుంటే.. తెచ్చిన ఒక్కరోజుకే చెడు పోతున్నాయి. ప్రతిరోజూ ఇలా జరుగుతుంటే.. వీటిని తినాలనిపించదు. మరి అవి చెడిపోకుండా ఉండాలంటే.. ఏం చేయాలి..
 
1. వంకాయలను కోసిన వెంటనే ఓ స్పూన్ పాలు కలిపిన నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు. కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోండి నింపి మూడు గంటల తర్వతా కడగాలి. 
 
2. టమోటాలను తొడిమి కింది వైపుకు వచ్చేట్లుగా ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. బెండకాయల జిగురు పోవాలంటే.. వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం లేదా స్పూన్ పెరుగు వేస్తే జిగురు పోతుంది.
 
3. బంగాళాదుంపలను వారం పాటు నిల్వ చేస్తే మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఓ ఆపిల్‌ను ఉంచాలి. ఇలా చేస్తే బంగాళాదుంపలు తాజాగా ఉంటాయి.