శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 8 మే 2021 (12:56 IST)

కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు

1. లక్షణాలు కనబడిన  మొదటి రోజే హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ మొదలు పెట్టండి.
 
2. లక్షణాలు కనబడిన మొదటి రోజే ఒక డాక్టర్(online/offline) పర్యవేక్షణ లో ఉండండి.
 
3. లక్షణాలు కనబడిన రెండో రోజు RTPCR test ఇవ్వండి. దాని రిజల్ట్ గురించి ఆందోళన వద్దు.
 
RTPCR లో పాజిటివ్ రాగానే కంగారు పడుతూ హాస్పిటల్స్ కి పరిగెత్తకండి. RTPCR లో నెగెటివ్ వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కరోనా కాదని ఊహించకండి. ఒక పదిరోజులు కరోనానే అనుకుని జాగ్రత్తగా ఉండటం వలన ప్రపంచం ఏమీ తల్లకిందులైపోదని గుర్తించుకోండి.
 
4. లక్షణాలు కనబడిన ఐదవరోజు వరకు రక్తపరీక్షలు, చెస్ట్ ఎక్స్ రే, సీటీ స్కాన్ల అవసరం ఉండదు.
 
5. లక్షణాలు ఉన్నా తగ్గినా ఐదు లేదా ఆరవ రోజు రక్త పరీక్షలు డాక్టర్ సూచించినట్టు చేయించుకోండి.
 
6.అవసరం ఐతే చెస్ట్ ఎక్స్ రే లేదా సీటి స్కాను ఐదు నుంచి పది రోజుల మధ్య చేయించే అవకాశం ఉంటుంది. అది ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ మీ లక్షణాలనుబట్టి వచ్చిన రక్త పరీక్షల రిపోర్ట్ లను బట్టి నిర్ణయిస్తారు.
 
7. లక్షణాలు మొదలైన ఐదవ రోజునుంచి ప్రతి మూడు గంటలకొకసారి పల్స్ ఆక్సీమీటర్ ను చూసుకుంటూ ఉండండి. ఆక్సిజన్ శాతం 94% కన్నా తక్కువగా ఉన్నా పల్స్ రేట్ 120/మినిట్ కన్నా ఎక్కువగా ఉన్నా మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళండి.
 
8. లక్షణాలు కనబడ్డ ఐదో రోజు నుంచి పదో రోజు వరకు జ్వరం పెరిగుతున్నా లేదా జ్వరం కంట్రోల్ కి రాకున్నా దగ్గు పెరుగుతున్నా లేదా దగ్గు కంట్రోల్ కి రాకున్నా మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళండి.
 
9. Oxygen శాతం 93% కంటే తక్కువగా ఉంటేనే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం. 90-93% ఉన్నప్పుడు ఆయాసం లేకపోతే  ఆందోళన అవసరం లేదు. ఆ సమయంలో మీ డాక్టర్ తో మాట్లాడండి. నింపాదిగా ఉంటూ ఎక్కడైనా బెడ్ దొరకగలదేమో ప్రయత్నించండి. కంగారు పడుతు పేషంట్ ని కంగారు పెట్టడం వలన ఆక్సిజన్ శాతం మరింత వేగంగా పడిపోయే ప్రమాదం ఉంది.
 
10. 93%కంటే తక్కువగా ఆక్సిజన్ పడిపోవడమన్నది పదిమందిలో ఒకరికి జరిగే అవకాశం ఉంది. కాబట్టి భయం అనవసరం. సంయమనంతో కంగారు పడకుండా ఉండేవాళ్ళలో 90% కి తగ్గి కూడా మెల్లిగా మళ్ళీ అదేంతకు అదే ఒకరోజులో మామూలు స్థితికి వస్తుంది. కాబట్టి ఆక్సిజన్ శాతం తగ్గినపుడు ఆందోళన పడకపోవడం చాలా చాలా ముఖ్యం.
 
11. హోం ఐసోలేషన్లో సరిగా తినని వాళ్ళు కరోనానుండి కోలుకోవడాని చాలా సమయం పడుతోంది. సరిగా తినని వాళ్ళలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కూడా తగినంత స్థాయిలో ఉండటం లేదు. అంతే కాక వీళ్ళలో కరోనా వలన విపరీతమైన నీరసం ఆవహిస్తున్నది. కరోనా తగ్గాక కూడా మూడు నెలలు ఈ నీరసం బాధపెడుతున్నది. కాబట్టి ప్రతి మూడుగంటలకు ఎంతో కొంత తినడం ముఖ్యం. షుగరు జబ్బు ఉన్నవారు తగినంత ఆహారం తీసుకుంటూ ఇంట్లో రెండు పూటలా షుగర్ టెస్టు చేసుకుంటూ మీ డాక్టర్ సూచించానట్టు ఏ రోజుకారోజు షుగరు మందుల డోసు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
 
12.హోం ఐసోలేషన్ లో ఉన్నపుడు వీలైనంత పడుకోవడమూ అవసరం. అనవసర శక్తి ప్రదర్శన వ్యాయామాలు చేస్తూ తాము బాగానే ఉన్నామని అనుకోకూడదు. ఏ జ్వరం వచ్చినపుడైనా పూర్తి విశ్రాంతి చాలా అవసరం. శరీరం విశ్రాంతిలో తిరిగి పుంజుకున్నంతగా ఎందులోనూ పుంజుకోదనే విషయం మనకందరికి తెలుసు. కాబట్టి నిద్రను ఎట్టి పరిస్థితుల్లో అలక్ష్యం చేయకూడదు.

12-14 గంటల నిద్ర హోం ఐసోలేషన్లో అవసరం. రాత్రి ఎనిమిది గంటలకంటే ముందే నిద్రపోతున్న వారిలో కరోనా లక్షణాల తీవ్రత ఉండటం లేదు. ఎనిమిది తరువాత టీవీలు సెల్ఫోన్లు చూస్తూ రాత్రిళ్ళు మేలుకొంటూ, ఆందోళన చెందేవారిలో వైరస్ ని చంపే గుణం గల మెలటోనిన్ ఉత్పత్తి జరగడంలేదు. అందుకే త్వరగా కోలుకోవడమూ లేదు.
 
13. భయంగొలిపే వార్తలకు దూరంగా ఉండటం చాలా అవసరం. మంచి సంగీతం..సరదా జోక్సు మనసును తేలికపరుస్తాయి. బంధుమిత్రులు ఆందోళన పడుతూ ఇచ్చే సలహాలు వృథా అని గుర్తించండి. వాళ్ళు ఆందోళన పడుతూ మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తూ చివరికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లనూ ఆందోళన పెడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ విషయంలో పదిమంది చేతులు పెట్టకుండా చూసుకోవడం అవసరం. ఒక డాక్టర్ చాలు.