ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (11:33 IST)

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా తీవ్రత

coronavirus
దేశంలో కరోనా వైరస్ తీవ్రత స్వల్పంగా తగ్గింది. ప్రతి రోజూ 3 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండగా, గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేలకు దిగువకు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 4.84 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 2288 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అదేసమయంలో 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల్లో 10 మంది చనిపోయారు. అలాగే, 3044 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలకు దిగువకు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 19637 యాక్టివ్ కేసులు ఉండగా, పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. క్రియాశీలక రేటు 0.50 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 190.50 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.