సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (12:00 IST)

పెరుగుతూ తగ్గుతూ వున్న కరోనా కేసులు.. 43వేలకు పైగా కేసులు

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వున్నాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసులు పెరిగాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 43వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగింది. 
 
దేశవ్యాప్తంగా మొత్తం 43,654 కొత్త కేసులు నమోదు కాగా 640 మంది కోవిడ్ మహమ్మారికి బలైపోయారు. 43,654 కొత్త కేసులు నమోదుతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,84,605కు చేరింది.అలాగే నిన్న ఒక్కరోజే 640 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 4,22,022కు చేరింది.
 
అలాగే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. ఈక్రమంలో 44,61,56,659 వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేశామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,63,147 మంది కోలుకున్నారు. 3,99,436 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 44,61,56,659 వ్యాక్సిన్ డోసులు వేయగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.