శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (15:02 IST)

యునైటెడ్ స్టేట్స్‌లో డెల్టా వేవ్ విజృంభణ.. 1.5 లక్షల కేసులు

యునైటెడ్ స్టేట్స్‌లో డెల్టా వేవ్ విజృంభిస్తోంది. దేశంలో లక్షల మంది కరోనాతో సతమతమవుతున్నారు. యావరేజ్‌గా చూస్తే… 1.5 లక్షల కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. కేవలం మంగళవారం నాడు చూసుకున్నట్లయితే 2.66 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
నిజంగా ఎంత దారుణమో కదా.. ఏకంగా 43 రాష్ట్రాలలో ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి అని తెల్సుస్తోంది. డిసెంబర్ తర్వాత నుండి కూడా యుఎస్ లో పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ లో 3.8 కోట్ల కేసులు నమోదయ్యాయి. 
 
కాగా 6.3 లక్షల మంది కరోనా కారణంగా మరణించారు ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని.. కరోనా కేసులుని కంట్రోల్ చేయాలని అంటున్నారు నిపుణులు.
 
భారతదేశంలో కూడా మొన్న మొన్నటి వరకూ ఇంత ఘోరమైన స్థితి ఉంది. ఇదిలా ఉంటే భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కలిగినప్పుడు మీడియా కవరేజ్ ఎక్కువగా ఉంది. కానీ యుఎస్ లో రెండు లక్షలు దాటి కేసులు నమోదైనా మీడియా కవరేజ్ చేయడం లేదు.