మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (21:17 IST)

చైనాను వణికిస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్, ఏంటీ ఈ స్టెల్త్ ఒమిక్రాన్, దీని లక్షణాలు ఏమిటి?

కరోనావైరస్ సమయంలో చైనా చెప్పేవరకూ అది ఇలా వుంటుంది, ఇంతమందిని బలితీసుకుంటుందని తెలియదు. ఇప్పుడు మళ్లీ చైనాలో విజృంభిస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్ గురించి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ స్టెల్త్ ఓమిక్రాన్ అంటే ఏమిటి?
 
వుహాన్ నుంచి పుట్టినట్లు చెప్పబడుతున్న కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపించే అత్యంత ట్రాన్స్మిసిబుల్ ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుందని ప్రారంభ పరిశోధనలు సూచిస్తున్నాయి. డానిష్ పరిశోధకుల నేతృత్వంలోని ఒక అధ్యయనం ప్రకారం, ఒమిక్రాన్ బిఎ-2 ఉప-వేరియంట్.

 
ఇది అసలు ఒమిక్రాన్ జాతి కంటే 1.5 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, బి.1.1.529 అని కూడా పిలిచే ఒమిక్రాన్, బిఎ.1, బిఎ.2, బిఎ.3 అనే మూడు ప్రధాన ఉపజాతులను కలిగి ఉంది. బయో ఇన్ఫర్మేటిషియన్ కార్నెలియస్ రోమెర్ ప్రకారం, బిఎ.2 సబ్‌వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగానే వుంటుందన్నది పరిశోధకుల మాట.
 
 
స్టెల్త్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా వుంటాయి?
ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తులకు బదులుగా ఎగువ శ్వాసకోశంపై ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే చెప్పింది. ఒమిక్రాన్ రూపాంతరం సాధారణంగా జలుబు వంటి లక్షణాలతో మొదలవుతుంది. అలాగే మైకంగా వుండటం, అలసటగా వుండటం ప్రారంభ దశ లక్షణాలు. ఇతర లక్షణాలు ఎలా వుంటాయంటే... జ్వరం, విపరీతమైన అలసట, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల అలసట, హృదయ స్పందన రేటు పెరిగిపోవడం వంటివి కనిపిస్తాయి.
బిఎ.2 వేరియంట్‌లో రుచి- వాసన కోల్పోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎక్కువగా గమనించబడిన లక్షణాలలో జలుబు ఒకటి. ఒమిక్రాన్ 2 వేరియంట్‌ను 'స్టెల్త్ ఒమిక్రాన్' అని కూడా పిలుస్తారు.

 
ఇది ప్రమాదకరమా?
స్టెల్త్ ఒమిక్రాన్ లేదా బిఎ.2 సబ్-వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. బిఎ.2 అనేది ఒమిక్రాన్ ఐదవ రూపాంతరం. ఇది గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడింది. బిఎ.2 వేరియంట్ చైనాతో ఆగిపోదనీ, ఇది ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
 
 
స్టెల్త్ ఒమిక్రాన్ వల్ల భారత్‌లో అంత ఇబ్బంది ఉండదని భారతీయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నప్పటికీ, భారతదేశంలో బిఎ.2 వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. భారతదేశంలో థర్డ్ వేవ్ సమయంలో, బిఎ.2 బారిన పడిన వారి సంఖ్య 75% కంటే ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ఐఐటి కాన్పూర్ అధ్యయనంలో జూన్ 22 నాటికి ఫోర్త్ వేవ్ భయాందోళన సరైనది కాదనడానికి ఇదే కారణం.