సోనూసూద్‌కు సిద్ధిపేట చెలిమితండాలో విగ్రహం..

sonu sood
sonu sood
సెల్వి| Last Updated: సోమవారం, 21 డిశెంబరు 2020 (13:26 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో.. వలస కార్మికులకు అండగా వుండిన బాలీవుడ్ హీరో సోనూసూద్ ఆపై పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నటుడు సోనూ సూద్‌ లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి విశేషమైన సేవలందించి రియల్‌ హీరోగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోనూ సూద్‌కి ఏకంగా గుడి కట్టేశాడు. అది కూడా తన సొంత ఖర్చుతో సోనూ సూద్‌కు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ అభిమాని.

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాలో సోనూ సూద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్‌కు సోనూసూద్‌ అంటే అభిమానం. కరోనా సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్‌ తమ తండాలో సోనూ సూద్‌ కోసం ఏకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేష్‌ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు.దీనిపై మరింత చదవండి :