దేశంలో కొత్తగా మరో 15 వేల కేసులు - 25 మంది మృతి
దేశంలో కొత్తగా మరో 15 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 4.68 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 15,528 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.
కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3 శాతానికి పైగా నమోదైంది. ముందురోజు 50కి పైగా సంభవించిన మరణాలు.. 24 గంటల వ్యవధిలో 25కి తగ్గాయి. గత రెండేళ్ల కాలంలో 4.37 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.25 లక్షల మంది మరణించారని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,43,654 (0.33శాతం)కు చేరాయి. సోమవారం 16 వేల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. ఇక ఇప్పటివవరకూ 200.3 కోట్ల టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 27.78 లక్షల మంది టీకా వేయించుకున్నారని కేంద్రం తెలిపింది.