బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:58 IST)

కరోనా కాటు, రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ ఆంగడి కన్నుమూత

న్యూఢిల్లీ: కరోనావైరస్ (కోవిడ్ -19) సోకి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ ఆంగడి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన కన్నుమూశారు.
 
ఆయనకు కరోనాపాజిటివ్ రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తూ వస్తున్నారు. కాగా రైల్వే శాఖ సహాయమంత్రి ఆంగడి అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసి నివాళులర్పించారు.
 
'సురేష్ ఆంగడి అంకితభావంతో ఉన్న ఎంపీ, సమర్థ మంత్రి. కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అతని మరణం విచారకరం.' అని ట్వీట్ చేశారు.