శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (20:55 IST)

అమెరికాలో ప్రతి 33 సెకన్లకు ఒకరు కరోనాతో మృతి..

అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. కరోనా వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకునే సమయంలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో గత వారం రోజులుగా అమెరికాలో ప్రతి 33 సెకన్లకు ఒకరు కరోనాతో మృతి చెందుతున్నారని రాష్ట్ర, కౌంటీ నివేదికలు పేర్కొంటున్నాయి. గడిచిన వారం రోజుల్లో 18,000ల మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. 
 
ఏడాది చివరి రోజులు కావడంతో ప్రజలు ప్రయాణాలు చెయ్యవద్దని ఆరోగ్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. టెన్సిసీ, కాలిఫోర్నియా, రోడ్ ఐలాండ్ రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయోవా, సౌత్ డకోటా, రోడ్ ఐలాండ్లో మరణాల రేటు అధికంగా ఉందని, దేశవ్యాప్తంగా 11.3శాతం మందికి రెండోసారి తిరిగి కరోనా సోకిందని అధికారులు తెలుపుతున్నారు.ే