మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (20:50 IST)

యాక్సిడెంట్ చేసిన రహానే తండ్రి.. అరెస్టు

భారత క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి ఓ యాక్సిడెంట్‌ చేశాడు. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు చనిపోయింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

భారత క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి ఓ యాక్సిడెంట్‌ చేశాడు. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు చనిపోయింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మహారాష్ట్రలోని నేషనల్  హైవే 4పై కుటుంబంతో కలిసి మధుకర్ బాబూరావు రహానే తన హుండై ఐ20లో కారులో ప్రయాణిస్తుండగా, కంగల్ ప్రాంతంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి 67 ఏళ్ల ఆశాతాయ్ కాంబ్లి అనే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.
 
దీంతో కోల్హాపూర్ పోలీసులు రహానే తండ్రిపై ఐపీసీ సెక్షన్లు 304ఏ, 289, 337,338 కింద కేసు నమోదు చేశారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో కోల్హాపూర్ పోలీసులకు రహానే తండ్రిని అదుపులోని తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, ప్రస్తుతం రహానే మూడు వన్డే కోసం విశాఖపట్నంలో ఉన్నాడు.