శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జులై 2023 (19:01 IST)

వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్.. విరాట్ కోహ్లీ రికార్డు

Kohli
వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ముందుగా టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే టీ20 సిరీస్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆడి భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. 
 
విరాట్ కోహ్లీ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతను వెస్టిండీస్ లెజెండ్ చంద్రపాల్‌తో కూడా ఆడాడు. ఈరోజు తొలి టెస్టులో చందర్‌పాల్‌తో జూనియర్ ఆడబోతున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో తండ్రీకొడుకుల సరసన ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్‌తో కోహ్లీ చేరాడు.
 
సచిన్ టెండూల్కర్ 1992లో ఆస్ట్రేలియన్ జియోఫ్ మార్ష్‌తో తలపడ్డాడు. ఆ తర్వాత అతను 2011/12 ఆస్ట్రేలియా పర్యటనలో మార్ష్ కుమారుడు షాన్ మార్ష్‌తో ఆడే అవకాశాన్ని పొందాడు. 
 
వెస్టిండీస్ యువ ప్రతిభగా, 'జూనియర్' చందర్‌పాల్ ఇప్పటివరకు 6 టెస్టులు ఆడి 45.30 సగటుతో పరుగులు సాధించాడు. తన తండ్రిలా భారత బౌలర్లకు సవాల్ విసిరేందుకు అతను ఉత్సాహంగా ఉంటాడు.