మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (13:37 IST)

ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు..

టీమిండియా భారత జట్టులో సీనియర్ ఆటగాడు ఎంఎస్. ధోనీపై ఇప్పటివరకు వున్న టీమిండియా రికార్డును వికెట్ కీపర్ రిషబ్ బద్ధలు కొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రిషబ్ అద్భుతంగా రాణించాడు.


ఇప్పటిదాకా ఏ వికెట్ కీపర్‌కు సాధ్యం కాని ఫీట్ సాధించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను అవుట్ చేయడంలో భాగస్వామ్యం వహించడం ద్వారా ఈ యంగ్ బౌలర్ రిషబ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 
 
ఇప్పటివరకు ధోనీ పేరిట ఐదుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్లను అవుట్ చేసి భాగస్వామ్యం వహించాడు. కానీ రిషబ్ ధోనీ రికార్డును బద్ధలు చేస్తూ.. ఆరుగురిని అవుట్ చేయడంతో ధోనీని వెనక్కి నెట్టాడు. 
 
కాగా... టీమిండియా ఆసీస్ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్ అడిలైడ్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 250 పరుగుల స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యింది. ఆస్ట్రేలియాను కూడా కేవలం 235 పరుగులకు కట్టడి చేసింది. తద్వారా టీమిండియా పైచేయి సాధించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో రిషబ్ కీలక పాత్ర పోషించి.. అరుదైన రికార్డును నెలకొల్పాడు.