శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (15:39 IST)

ఒక్క పెళ్లికే అష్టకష్టాలు పడ్డాను.. మళ్లీ ఇంకో పెళ్లినా : మహ్మద్ షమీ

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు తన మొదటి భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించారు. ఒక్క పెళ్లికే అష్టకష్టాలు పడుతున్నాననీ, ఇకపై మళ్ళీ రెండో పెళ్లినా అంటూ పెదవి విర

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు తన మొదటి భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించారు. ఒక్క పెళ్లికే అష్టకష్టాలు పడుతున్నాననీ, ఇకపై మళ్ళీ రెండో పెళ్లినా అంటూ పెదవి విరిచారు. పైగా, నేను మరీ అంత పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ వ్యాఖ్యానిస్తూనే.. ఒక వేళ రెండో పెళ్లంటూ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జాహ‌న్‌ను ఆహ్వానిస్తా అని చెప్పారు.
 
షమీ మొదటి భార్య హసీన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ష‌మీకి చాలా మంది అమ్మాయిల‌తో సంబంధాలున్నాయ‌ని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని, త‌న‌న చంపేందుకు కూడా కుట్ర ప‌న్నాడ‌ని ష‌మీపై జాహ‌న్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది. ఈ వార్తలు ఓ కుదుపు కుదిపాయి. ఈ నేపథ్యంలో ఆమె మరో ఆరోపణ చేసింది. 'రంజాన్ పండుగ అయిన ఐదు రోజులుకు తన సోద‌రుడి భార్య చెల్లెల్ని ష‌మీ పెళ్లి చేసుకోబోతున్నాడ‌' అని జాహ‌న్ ఆరోపించింది.