గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (13:54 IST)

క్రికెట్‌లో ఫోర్లు - సిక్స్‌లే కాదు.. ఎయిట్స్ కూడా ఉండాలని.. ధోనీ నయా ఐడియా

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను బంతి దాటితే ఇస్తున్న ఫోర్, సిక్స్‌లకు అదనంగా ఎయిట్ (8)ను కూడా చేర్చాలని అన్నాడు. బ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను బంతి దాటితే ఇస్తున్న ఫోర్, సిక్స్‌లకు అదనంగా ఎయిట్ (8)ను కూడా చేర్చాలని అన్నాడు. బంతి స్టేడియం బయట పడితే ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందనే సరికొత్త అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 
 
ప్రస్తుతం జరుతున్న ఐపీఎల్ పదకొండో సీజన్ పోటీల్లో భాగంగా, మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత పసులు జెర్సీ వేసుకుని సీఎస్కే జట్టుకు ధోనీ నాయకత్వం వహించాడు. 
 
ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే జట్టు సులభంగా చేధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్స్‌లు నమోదు కాగా, కొన్ని బంతులు స్టేడియం బయటకు వెళ్లిపోయాయి కూడా. ఇక ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడిన ధోనీ బంతి బయట పడితే ఆరు పరుగులకు బదులుగా ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది ఇపుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.