శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (08:36 IST)

ఆసియా కప్‌లో నేడు.. మరో సూపర్‌ ఫైట్‌కు సర్వం సిద్ధం

india - pakistan
దుబాయ్ వేదికగా ఆసియా క్రికెట్ టోర్నీ సాగుతోంది. లీగ్ దశ పోటీలు ముసిగిపోగా, సూపర్-4 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మరోమారు తలపడుతున్నాయి. లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడగా, చివరి ఓవర్‍‌ వరకు సాగిన ఉత్కంఠ ఫోరులో రోహిత్ సేన విజయభేరీ మోగించింది. దుబాయ్ వేదికగా ఈ కీలక మ్యాచ్ జరుగనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ భారత్, పాకస్థాన్ మ్యాచ్ అంటేనే క్రీడా ప్రేక్షకులపైనే కాకుండా క్రీడాకారులపైనా ఒత్తిడి ఉంటుందన్నారు. ఈ ఒత్తిడి తమపై ఎంతలా ఉంటుందో అంతే స్థాయిలో భారత ఆటగాళ్లపైనా ఉంటుందని చెప్పారు. 
 
అయితే మ్యాచ్ ఆడుతున్నది హాంకాంగా లేకా శ్రీలంకనా లేక భారతా అనే విషయాన్ని చూడొద్దని తమ ఆటగాళ్లకు చెప్పానని తెలిపారు. పైగా ఇది బ్యాటుకు, బంతికి మధ్య జరిగే సమరమన్నారు. భారత్‌తో మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిపై ఒత్తిడితో పాటు అమితమైన ఆసక్తి ఉండటం సహజమని, అయితే, తాము నిబ్బరంగా, ప్రశాంతంగా మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.