గురువారం, 5 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (20:08 IST)

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ : భారత్ ఆధిక్యం 144 రన్స్ - ఆదుకున్న జడేజా

Jadeja
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ క్రమంగా పట్టు సాధిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 144 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ అర్థ సెంచరీలు చేయడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన ఇక్కడి పిచ్‌పై ప్రస్తుతానికి భారత్‌కు 144 పరుగులు కీలకమైన ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 
 
గాయం నుంచి కోలుకుని దాదాపు ఆరు నెలల తర్వాత మైదానంలో దిగిన రవీంద్ర జడేజా... అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు నేలకూల్చాడు. అలాగే, బ్యాటింగ్‌లోనూ రాణించి 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మర్ఫీ 5, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నాథన్ లైయన్ 1 చొప్పున వికెట్ తీశారు.