WTC finalకు వరుణ గండం.. టీమిండియా ఫోటోషూట్.. మయాంక్‌కు తలదువ్వుతూ?
భారత్, న్యూజిలాండ్ ల మధ్య సౌథాంప్టన్‌లో జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30 నిమిషాలకు ప్రారంభంకానుంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కివీస్ సారథి కేన్ విలియమ్సన్ లు ఈ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఎంతో ఆరాపడుతున్నారు. కారణం.. ఇప్పటివరకు వీరిద్దరి కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోపీ కూడా గెలవలేదు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించేందుకు ఇరు జట్ల సారథులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచివుంది.
అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు చాలా సరదాగా కనిపించాయి. ఫొటోషూట్ సందర్భంగా ఓ వీడియోను ఐసీసీ ట్వీట్ చేసింది. దీంట్లో ఆటగాళ్లంతా సందడిగా కనిపించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు భారత్, కివీస్ ఆటగాళ్లను ఫొటో షూట్ తీశారు. దీంట్లో ఇషాంత్ శర్మ ఫొటో దిగుతున్నప్పుడు.. మయాంక్ అగర్వాల్ నవ్వాడు. ఇషాంత్ ఫొటో స్టైల్స్ చూసి గట్టిగా నవ్వుతూ కనిపించాడు.
దీంతో మయాంక్ అగర్వాల్ ఫొటోదిగుతున్నప్పుడు.. లంబూ(ఇషాంత్ శర్మ) ప్రేమ్ లోకి ఎంటరయ్యాడు. అంతటితో ఊరుకోకుండా మయాంక్ హెయిర్‌ను దువ్వాడు. దీంతో అప్పుడు కూడా మయాంక్ బిగ్గరగా నవ్వూతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అలాగే పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, కెప్టెన్ విరాట్‌కోహ్లీ, ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ కూడా పలు రకాలుగా ఫోజులిచ్చారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం సరదాగా ఫొటోషూట్‌లో కనిపించారు.