గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:52 IST)

భువనగిరిలో పరువు హత్య - ప్రేమ పెళ్లి చేసుకున్న హోంగార్డు హత్య

murder
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న హోంగార్డు ఒకరు శవమై కనిపించారు. దీంతో వధువు తరపు బంధువులే ఈ హత్యకు పాల్పడివుంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడిని హోంగార్డు రామకృష్ణగా గుర్తించారు. 
 
ఈయన కొన్ని నెలల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే, రామకృష్ణను ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, హోంగార్డుగా ఉన్న రామకృష్ణ విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. రామకృష్ణ మామనే ట్రాప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హోంగార్డు మృతదేహాన్ని సిద్ధిపేట వద్ద గుర్తించారు. ప్రస్తుతం ఈ హత్య జిల్లాలో సంచలనమైంది.