గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

కుమార్తెకు నిద్రమాత్రలిచ్చి కన్నతండ్రి అత్యాచారం.. ఎక్కడ?

victim
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కన్న కుమార్తెను కాటేశాడు. కుమార్తెకు పాలల్లో నిద్రమాత్రలు కలిపిచ్చి.. ఆమె నిద్రలోకి జారుకోగానే అత్యాచారానికి తెగబడసాగాడు. ఈ దారుణం హైదరాబాద్ నగర ప్రాంతమైన కుషాయిగూడలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 27వ తేదీన కాప్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీటీమ్స్, పోలీసులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో అదే స్కూల్‌ల 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక కన్నతండ్రి నుంచి ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి షీటీమ్స్ సభ్యులకు వివరించింది 
 
తన తల్లి గత కొన్నేళ్లుగా అనారోగ్యంత బాధపడుతుందని, దీంతో తన తండ్రి పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చేవాడని తెలిపింది. తాను కుమార్తె నిద్రలోకి జారుకోగానే తండ్రి తనపై లైంగికదాడికి పాల్పడినట్టు బోరున విలపిస్తూ చెప్పింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధ తండ్రి ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.