శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 మే 2023 (10:30 IST)

తన స్నేహితుడితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలోకే వివాహిత హత్య...

murder
విశాఖపట్టణం జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. తాను పరిచయం చేసిన స్నేహితుడితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలోని ఓ వ్యక్తి తన వివాహితురాలైన ప్రియురాలిని గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన  ఈ వివరాలను పరిశీలిస్తే, అనకాపల్లి జిల్లా పరవాడ ప్రాంతానికి చెందిన గోపాల్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. గోపాలు గతంలో అదే ప్రాంతానికి చెందిన వివాహిత శ్రావణి (28)తో పరిచయమేర్పడింది. ఆమె విశాఖ జగదాంబ కూడలిలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నారు. భర్తతో విభేదాల కారణంగా దూరం ఉంటూ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆరు నెలలుగా గోపాల్‌తో కలిసి జీవిస్తున్నారు. 
 
తన స్నేహితుడైన వెంకటేష్ అలియాస్ వెంకిని శ్రావణికి ఇటీవల గోపాల్ పరిచయం చేశాడు. శ్రావణి ఆయనతో తరచూ ఫోనులో మాట్లాడటం నచ్చని గోపాల్.. శ్రావణితో గొడవపడ్డాడు. దీనిపై మాట్లాడుకుందామని చెప్పి శ్రావణి, వెంకటేష్, గోపాల్ ఒకే వాహనంపై శుక్రవారం రాత్రి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. అక్కడ వారు మాట్లాడుకుంటుండగా పోలీసులు గమనించి పంపించేయటంతో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వెనక్కి వెళ్లిపోయారు. 
 
శ్రావణితో ఒంటరిగా మాట్లాడాలని గోపాల్ కోరటంతో వెంకటేష్ కాస్త దూరం వెళ్లారు. ఈ సమయంలో వెంకటేష్‌తో చనువుగా ఉండటంపై శ్రావణి, గోపాల్ మధ్య వాగ్వాదమేర్పడింది. గోపాల్ కోపోద్రిక్తుడై ఆమె గొంతు నులిమి హతమార్చాడు. విగతజీవిగా పడి ఉన్న శ్రావణిని అక్కడే విడిచిపెట్టి ఇప్పుడే వస్తానంటూ వెంకటేష్‌తో చెప్పి నేరుగా గాజువాక పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.