బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:10 IST)

2022లో పాదయాత్రలు... తెలంగాణాను చుట్టేసిన రాజకీయ పార్టీలు

shyamala - sharmila
బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు 2022లో పాదయాత్రలు చేపట్టారు. తెలంగాణను ఈ పార్టీలు చుట్టేశాయి. అధికార, విపక్షాల శత్రుత్వం ఈ యాత్రల్లోనూ కనిపించింది. రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల, బండి సంజయ్, అరవింద్, రాజాసింగ్ వంటి నేతలు ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించారు. 
 
ప్రభుత్వం కూడా శాంతిభద్రతల పేరుతో విపక్ష నేతలను గృహ నిర్భంధంలో ఉంచింది. అరెస్టులు చేసింది. పాదయాత్రల్లో అధికార, విపక్ష శ్రేణులు కొట్టుకుని గాయపడ్డాయి. వివాదాల కేరాఫ్ అడ్రస్, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లింది కూడా ఈ ఏడాది. 
 
టీఆర్ఎస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లు ఖర్చు పెట్టిన మునుగోడు ఉప ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికల సీన్ గుర్తు చేశారు. హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ వామపక్షాల మద్దతుతో గెలుపొందింది. ఓడిన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి బలమున్నా, ఇటీవల ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ బలం పెరుగుతోందడానికి ఈ ఎన్నికలు రుజువైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.