బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By selvi
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (15:43 IST)

దీపావళి రోజున తులసి చెట్టు చుట్టూ దీపారాధన చేస్తే..?

దీపాల పండుగ దీపావళి రోజున దివ్వెలతో ఇంటిల్లపాదిని అలంకరించుకోవడం ఆనవాయితీ. పవిత్రమైన తులసీకోట ముందు, చుట్టూ దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలతో సుఖంగా వుంటారు. దీపావళి రోజున మాత్రమే కాకుం

దీపాల పండుగ దీపావళి రోజున దివ్వెలతో ఇంటిల్లపాదిని అలంకరించుకోవడం ఆనవాయితీ. పవిత్రమైన తులసీకోట ముందు, చుట్టూ దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలతో సుఖంగా వుంటారు. దీపావళి రోజున మాత్రమే కాకుండా తులసీ కోట ముందు ఉదయం, సాయంత్రం సమయాల్లో భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో తులసీ చెట్టు వుంటే.. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వుండవు.
 
ఇక పవిత్రమైన తులసి ఆకులను మంగళ, శుక్ర, ఆదివారాల్లో కోయకూడదు. ఏకాదశి, పూర్ణిమ ద్వాదశి తిథులలోనూ, రాత్రి పూట తులసీ ఆకులను కోయటం కానీ ముట్టుకోవడం కానీ చేయకూడదు. అన్ని చెట్లు, వృక్షాలు కార్బన్ డయాక్సైడ్‌ను రాత్రిపూట విడుదల చేస్తాయి. కానీ ఒక్క తులసీ చెట్టు మాత్రం రోజుకు 22 గంటలు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. అలాంటి తులసీ ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు వుండవు. తులసీ ఆకుల రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.