మంగళవారం, 13 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (10:18 IST)

దీపావళికి పచ్చకర్పూరం.. ఎర్రటి గుడ్డలో మెయిన్ డోర్ కు కడితే?

Pacha karpooram
నరక చతుర్దశి రోజున ఇంటి శుభ్రతతో పాటు శరీర శుభ్రత కూడా చాలా ముఖ్యం. ఈ రోజు నీటిలో పచ్చకర్పూరంతో స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది. అలాగే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. 
 
ఈ రోజు ఇంటి మెయిన్ డోర్ కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున పచ్చకర్పూరంను ఎర్రటి గుడ్డలో ప్రధాన ద్వారానికి వేలాడదీయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుంది. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. దీనితో పాటు, కంటి దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది.
 
పర్స్‌లో డబ్బు నిలవకపోతే, మీ పర్సులో కొన్ని పచ్చకర్పూరం ఉంచుకుంటే మంచి ఫలితం వుంటుంది. డబ్బు ఖర్చు తగ్గుతుంది. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా పచ్చకర్పూరం ఇంటి బాత్‌రూమ్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ అంతమై కుటుంబ వాతావరణం సానుకూలంగా మారుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.