మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (18:03 IST)

పెరుగుతో శాండ్‌విచ్ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ - 4 గట్టి పెరుగు - పావుకప్పు ఉప్పు - తగినంత క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు - అరకప్పు పచ్చిమిర్చి - 1 ఆవపొడి - పావు స్పూన్ మిరియాల పొడి - పావు స్పూన్ కొత్తి

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - 4
గట్టి పెరుగు - పావుకప్పు 
ఉప్పు - తగినంత
క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు - అరకప్పు
పచ్చిమిర్చి - 1
ఆవపొడి - పావు స్పూన్
మిరియాల పొడి - పావు స్పూన్
కొత్తిమీర తురుము - కొద్దిగా
నూనె - సరిపడా
వెన్న - 2 స్పూన్స్
 
తయారీ విధానం:  
బ్రెడ్‌ స్లైసెస్‌ను వెన్నతో వేయించి తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. పెరుగు చాలా గట్టిగా ఉండేందుకు పలుచని బట్టలో వేసి నీళ్లన్నీ వడగట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కూరగాయల ముక్కలు, పెరుగు అన్నింటిని వేసి బాగా కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని బ్రెడ్‌ ముక్కల మధ్యలో పెట్టి గట్టిగా నొక్కి అందించాలి. అంతే పెరుగు శాండ్‌విజ్ రెడీ.