బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (10:23 IST)

పెరుగు ఎముకలకు బలం.. దానిమ్మ లేదా స్ట్రాబెర్రీ పండుతో కలిపి తింటే..?

పాలతో చేసిన పెరుగు ఎముకలను దృఢపరుస్తుందని, శరీర బరువును కాపాడుతుందని వైద్యులు చెప్తున్నారు. పాలతో తయారు చేసే పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకల సాంద్రతను సమతుల్యం చేసి బలపరుస్తుంది.
 
పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇది శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. చలికాలంలో పెరుగు జలుబు, దగ్గును నయం చేస్తుంది. పెరుగును అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలు వచ్చినప్పుడు పెరుగు తింటే అందులో ఉండే సహజసిద్ధమైన తేమ చర్మం పొడిబారకుండా చేస్తుంది 
 
మొటిమలతో బాధపడేవారికి పెరుగు గ్రేట్ రెమెడీ. దానిమ్మ లేదా స్ట్రాబెర్రీ పండుతో పెరుగు కలిపి తింటే శరీరం రిఫ్రెష్ అవుతుంది. పిల్లల ఆహారంలో పెరుగును ఉపయోగించాలి. కూరగాయలు, పెరుగుతో సలాడ్‌ను తయారు చేయడం మంచిదని వైద్యులు చెప్తున్నారు.