సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (10:32 IST)

బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా..?

చాలామంది అధిక బరువు కారణంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో శరీర బరువు తగ్గించుకోవడం కోసం ఏవేవో మందులు, మాత్రలు, టానిక్‌లు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించలేదని బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే.. పిండి పదార్థాలు అధికంగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పిండి పదార్థాలు తీసుకుంటే.. వాటిలోని కార్బోహైడ్రేట్స్ బరువు పెరిగేందుకు కారణంగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు పిండి పదార్థాలు తీసుకోవడం మానేయండి. అప్పుడే బరువు తగ్గుతారు. ఒకవేళ అలానే తింటే.. ఇక ఎప్పటికి బరువు తగ్గరని వైద్యులు చెప్తున్నారు. నేటి తరుణంలో చపాతీలు, పరోటాకు తినేవారే ఎక్కువగా ఉన్నారు. ఇవి లేని ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. 
 
చపాతీలు, పరోటాకు ఎన్ని తిన్నా కూడా కొద్దిగా అన్నం తినాలి. అప్పుడే బరువు పెరగదు. ఇటీవలే చేసిన ఓ పరిశోధనలో అన్నం తరచు తినేవారికి బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కాబట్టి చపాతీలు, పరోటాకు తినడం మానేసి.. అన్నం తినడం మొదలు పెట్టండి.. అప్పుడే మీరు బరువు తగ్గుతారు. లేదంటే.. ఇక మీ ఇష్టం.