బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (15:36 IST)

అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా..?

గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుకు పనిచేసివారు ఈ కాలంలో ఎక్కువగానే ఉన్నారు. కంప్యూటర్ వద్ద ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారికి చూపు మందగించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యల నుండి కొంతమేరకైనా విముక్తి పొందాలంటే.. కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు వైద్యులు. అవేంటో ఓసారి చూద్దాం...
 
కంప్యూటర్‌ దగ్గర ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారు ఎక్కువ సేపు పుస్తకాలు చదివే వారు ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి విశ్రాంతి నిచ్చి దూరపు చూపు చూస్తూ విశ్రాంతి తీసుకోవాలని నేత్ర వైద్యులు చూచిస్తున్నారు.
 
అలానే, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాలు, చీకటిలో చదవడం మానుకోవాలి. ఏసీ, వెంటి‌లేటర్‌ల నుండి వచ్చే గాలి నేరుగా ముఖంపై వచ్చి పడకుండా చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే వాహనంలో వెళ్లే సమయంలో కంటిపై నేరుగా వేగంగా వచ్చే గాలి పడకుండా కంటి అద్దాలు ధరించడం లేదా హెల్మెట్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన కళ్ళలోకి దుమ్ము, ధూళి పోకుండా ఉంటుంది.