శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 జులై 2021 (10:23 IST)

చికెన్ ఎక్కువగా తినేవాళ్ళు ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే?

చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. నాన్ వెజ్ అంటే ముందుగా అందరికి గుర్తికు వచ్చేది చికెన్.. అయితే నిపుణులు చెప్పిన విషయం ఏంటంటే.. వెజ్ అయిన నాన్ వెజ్ అయిన కూడా కొద్దిగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎక్కువగా తీసుకుంటే అది విషం అవుతుంది.

చికెన్ కూడా అంతే రుచిగా ఉంది కదా అని ఫుల్లుగా లాగిస్తే మాత్రం అనేక నష్టాలను ఎదుర్క్కొవాల్సి వస్తుంది... అసలు చికెన్ ను ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
 
చికెన్‌ను తెచ్చిన వెంటనే రెండు మూడు గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి... అమెరికన్లలాగా వారమంతా కొద్దికొద్దిగా వండుకుంటూ ఉంటే.. ఈలోగా ఈ బ్యాక్టీరియా పెరిగి... ఏదో ఒక రోజు పొట్టలో తేడా కొట్టేస్తుంది. ఆస్పత్రి పాలు కావాల్సి ఉంటుంది.. సూపర్ మార్కెట్ వంటి వాటిలో నిల్వ ఉంచిన చికెన్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదట..
 
కోళ్లఫారంలలో కోళ్లు ఏం తింటాయి. మొక్క జొన్నను కరకరలాడిస్తాయి. అంటే ఫుల్లుగా కొవ్వు పట్టేస్తుంది. ఆ చికెన్ మనం తింటే... మనకూ అదే కొలెస్ట్రాల్ పట్టుకుంటుంది. చికెన్ కొద్దిగా తింటే... బరువు తగ్గొచ్చు. అదే చికెన్ ఎక్కువగా తింటే... బరువు పెరుగుతారు.. చికెన్ తింటే వేడి కదా.. అనుకోవచ్చు.. అది కోళ్ల పెంపకం పై ఉంటుంది.
 
ఇకపోతే చికెన్ ను ఫ్రై కన్నా కూడా కర్రీ లాగా తీసుకోవడం మేలు.. చికెన్ బాగా ఎక్కువగా ఫ్రై అయితే... అది మన బాడీలోకి వెళ్లి... కాన్సర్ సోకేందుకు కారణం అవుతుందని పరిశోధనలు తేల్చాయి. ఎప్పుడో ఓసారి ఫ్రై చికెన్ తింటే పర్వాలేదు .రోజూ తింటేనే ప్రమాదం.

కోళ్లకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష రసాయనం ఉంటుంది. దీని వల్ల కోళ్లు మంచి కలర్ వస్తాయి. దిట్టంగా పెరుగుతాయి. అడుగు తీసి అడుగు వెయ్యలేనంత లావుగా అవుతాయి. అలాంటి వాటిని తింటే మనకు లేని పోని రోగాలు వస్తాయి..ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.