శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (12:50 IST)

పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడటం మానేదాం

పర్యావరణ పరిరక్షణ మన ఇంటి నుంచే మొదలుకావాలి. దాని కోసం మనవంతుగా ఏం చేయొచ్చంటే
 
ఒకప్పుడు గాజు నీళ్ల సీసాలు వాడే వాళ్లం. ఇప్పుడవి మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ప్లాస్టిక్ సీసాల బదులు వాటిని ఎంచుకుని చూడండి. ఆరోగ్యానికి మంచిది. పర్యావరణానికి ఉడతాభక్తిగా సాయం చేసిన వారవుతారు.
 
భూమిలో కరిగిపోయే బ్యాగులను అమ్ముతున్నారు ఇప్పుడు. అలాంటివి రెండు మూడు కొనిపెట్టుకుంటే , ప్లాస్టిక్ కవర్ల వాడకానికి చుక్కపెట్టొచ్చు.
 
రోజూ వాడే ప్లాస్టిక్ టూత్‌బ్రష్‌లను బదులుగా వెదురుతో చేసిన వాటిని ఎంచుకోండి. ఎక్కువ కాలం మన్నడమే కాకుండా భూమిలోనూ కలిసిపోతాయి.