బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 9 జూన్ 2022 (23:27 IST)

చింతపండులోని ఔషధ విలువులు... ఏంటవి?

చింతపండులో ఎన్నో ఔషధ విలువలున్నాయి. ఈ గుణాలు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. శరీరంలో నొప్పిని కూడా తగ్గిస్తుంది. శరీరం యొక్క శక్తి స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. చింతపండులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. చింతపండు విటమిన్లు బి, సితో పాటు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.

 
షుగర్ వ్యాధితో బాధపడేవారు చింతపండును వీలైనంత తీసుకుంటూ వుండాలని, అది ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు శరీరంలో శోషించబడకుండా నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి చింతపండు రసం సరిపోతుంది.

 
చింతపండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. సరైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల అనేక రకాల వైరల్ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడడంలో శరీరం ప్రభావవంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

 
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే చింతపండు తప్పక తినాలి. చింతపండులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది.

 
ఊబకాయం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా మంది సమస్యగా మారింది. చింతపండు తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. చింతపండులో హైడ్రోసిట్రిక్ అనే ఆమ్లం ఉంటుంది, ఇది శరీరంలోని కొవ్వును క్రమంగా తగ్గిస్తుంది.