సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (18:42 IST)

తామర పువ్వును తాగే నీటిలో వేసి.. మరిగించి తాగితే?

పువ్వుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఏయో పువ్వులు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయో ఓసారి చూద్దాం.. గోరింటాకు పువ్వులను నిద్రించే ముందు దిండుపై వుంచి నిద్రిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలాగే మల్లెపువ్వులు అలసటను దూరం చేస్తాయి. కంటి వ్యాధులను నయం చేస్తాయి. దాంపత్య జీవితానికి మల్లెలు ఉపకరిస్తాయి. 
 
ఇదే విధంగా రోజా పువ్వులు.. నోటిపూత, పేగు రుగ్మతలు, కిడ్నీ సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వవు. చెవి నొప్పికి రోజా తైలం రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రక్తాన్నీ శుద్ధీకరించడంలో రోజాపువ్వులు మెరుగ్గా పనిచేస్తాయి. ఇంకా తామర పువ్వును తాగే నీటిలో వేసి.. బాగా మరిగించి తాగితే.. ఉదర సంబంధిత రుగ్మతలు దూరమవుతాయి. జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
అదే విధంగా తామర గింజలను రోజూ పావు స్పూన్ తీసుకుంటే రక్తవృద్ధి చేకూరుతుంది. శరీర వేడి తగ్గుతుంది. మునగ పువ్వు శరీరంలో ఐరన్ శాతాన్ని  పెంచుతుంది. వేప పువ్వు పేగుల్ని శుభ్రపరుస్తుంది. నులిపురుగులను నశించేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.