గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (22:05 IST)

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ LDL నిరోధించే మార్గాలు ఇవే

bad cholesterol
చెడు కొవ్వు లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఆంగ్లంలో LDL. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము.
 
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది.
అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది కనుక బరువును కంట్రోల్ చేయాలి.
పొగతాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, తద్వారా గుండెపోటు అవకాశాలు ఎక్కువవుతాయి.
రాత్రి పడుకునే ముందు లేదంటే ఉదయం వేళ పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటే అది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, జీవక్రియను మెరుగుపరచడంలోను గ్రీన్ టీ సాయపడుతుంది.
అవిసె గింజలు తింటే అవి చెడు కొలెస్ట్రాల్ పైన ప్రభావం చూపి ఆ సమస్యను నిర్మూలిస్తాయి.
ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.