కొవ్వు పెరగకుండా ఏం చేయాలంటే?
కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే కలిగే అనారోగ్యం అంతాఇంతా కాదు. అందువల్ల దీన్ని అదుపులో వుంచుకోవాలి. కొలెస్ట్రాల్ ఏ ఆహారంలో ఎక్కువగా వుంటుందో తెలుసుకుని వాటికి దూరంగా వుండాలి. తక్కువగా వున్న వాటిని తినాలి. పత్తి నూనె, పొద్దుతిరుగుడు నూనె, సోయా నూనె వాడటం మంచిది. వెన్న, నెయ్యి, కొవ్వు నూనెలు వాడకూడదు.
మాంసాహారం బాగా అలవాటైనవారు కోడిమాంసం, కొవ్వు తక్కువగా వుండే చేపలు భుజించాలి. జంతు మాంసం భుజించడాన్ని మానివేయాలి. పాలపై మీగడ తొలగించి ఉపయోగించాలి. దేహపు బరువును అదుపులో ఉంచడానికి కెలొరీలను పెరగకుండా చూసుకోవాలి. అవసరానికి మించి తినకూడదు. క్రమబద్ధమైన వ్యాయామం, నడక ఆరోగ్యానికి చాలా మంచిది.