సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (13:12 IST)

లోదుస్తులతో పడిపోడుతున్న స్పెర్మ్ కౌంట్

పురుషులు ధరించే లోదుస్తుల కారణంగా స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ఫలితాలను హ్యూమన్‌ రిప్రోడక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఆ వివరాలను పరిశీలిస్తే,

పురుషులు ధరించే లోదుస్తుల కారణంగా స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ఫలితాలను హ్యూమన్‌ రిప్రోడక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఆ వివరాలను పరిశీలిస్తే...
 
వాస్తవానికి మగవాళ్లు వారికి సౌకర్యంగా ఉండేలా లోదుస్తులను ధరిస్తుంటారు. అయితే బాక్సర్లు వేసుకొన్న వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ ఎక్కువగా ఉండగా.. బ్రీఫ్స్‌ లేదా జాకీలు వేసుకొన్న వారిలో ప్రతికూల ఫలితాలు కనిపించాయని ఈ సర్వేలో వెల్లడైంది. 
 
ఈ మేరకు 600 మంది పురుషులపై పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి వీర్య వృద్ధి ఒక్కోవారం ఒక్కోలా ఉంటుందని, కౌంట్‌ తక్కువగా ఉన్నా సంతాన ప్రాప్తికి అడ్డుకాబోదని పలువురు యూరాలజిస్టులు చెబుతున్నారు. అయితే లోదుస్తులవల్ల స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుందనే అంశంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు.