మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (16:23 IST)

మధుమేహ వ్యాధిగ్రస్థులు బోర్న్‌విటా, కాంప్లాన్ తీసుకోకూడదట..

మధుమేహ వ్యాధిగ్రస్థులు తేనె, గ్లూకోజ్‌, బెల్లం, కేకులు, పేస్ట్రీలు, స్వీట్స్‌, లేత కొబ్బరినీరు, కొబ్బరి చట్నీలు, చల్లనీ పానియాలు, ఆల్కహాల్‌ తీసుకోకూడదు. అలాగే బోర్న్‌విటా, కాంప్లాన్‌, ఎండిన ద్రాక్ష, అ

మధుమేహ వ్యాధిగ్రస్థులు తేనె, గ్లూకోజ్‌, బెల్లం, కేకులు, పేస్ట్రీలు, స్వీట్స్‌, లేత కొబ్బరినీరు, కొబ్బరి చట్నీలు, చల్లనీ పానియాలు, ఆల్కహాల్‌ తీసుకోకూడదు. అలాగే బోర్న్‌విటా, కాంప్లాన్‌, ఎండిన ద్రాక్ష, అరటి, మామిడి, పనస, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, ఖర్జూరం, అత్తిపండ్లు లాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో కార్బొ హైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచివి కావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మధ్యాహ్నం భోజనంలో రెండు చపాతీలు, ఒక కప్పు గంజి తీసేసిన అన్నం తీసుకోవాలి. మధ్యాహ్నం ఆహారంలో ఒక కప్పు పెరుగు, ఆకుకూరలు, సలాడ్ ఓ కప్పు వుండేలా చూసుకోవాలి. ఉదయం అరకప్పు పండ్ల ముక్కలు తీసుకోవాలి. పలుచటి మజ్జిగ లేదా చక్కెర లేని నిమ్మకాయ రసాన్ని సేవించవచ్చు.
 
డయాబెటిస్ పేషెంట్లు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఒక కప్పు, అరకప్పు మొలకెత్తిన విత్తనాలు, 100 మిల్లీలీటర్ల చక్కెరలేని పాలను అల్పాహారంగా తీసుకోవాలి. బ్లాక్ బెర్రీ లేదా నేరేడు పండ్లు రోజుకు అరకప్పు తీసుకోవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. డయాబెటిస్‌తో బాధపడేవారు నెయ్యి, వెన్న, కొబ్బరినూనె, పామాయిల్‌, వనస్పతిని వాడిన ఆహారం తీసుకోకూడదు. సన్‌ఫ్లవర్‌ నూనె, మొక్కజొన్న నూనె మితంగా వాడాలి. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.