బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (15:51 IST)

చిన్నపాటి ఆరోగ్య చిట్కాలు..?

ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించాలని ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ, కొన్ని కారణాల చేత ఆ జీవితాన్ని పొందలేకపోతున్నామని చాలామంది బాధపడుతుంటారు. అటువంటివారు ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు..
 
1. గంధాన్ని అరగదీయాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలిపి చర్మానికి రాసుకుంటే అలర్జీలు, నల్ల మచ్చలు తగ్గిపోతాయి. 
 
2. పంటినొప్పితో బాధపడేవారు నిమ్మరసంలో కాస్త ఇంగువ కలిపి కొద్దిగా వేడి చేసుకోవాలి. ఈ రసాన్ని నొప్పిగా ఉన్న పంటిలో పెట్టుకుంటే.. పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
 
3. ఎండు ఖర్జూరాన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కాసేపు అలానే ఉంచి ఆపై కొద్దిగా తేనె కలుపుకుని త్రాగితే ఆస్తమా వ్యాధి రాదు.
 
4. ప్రతిరోజూ తులసి ఆకులను నమిలి తింటే హైపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.