ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (22:42 IST)

సూర్యముద్రతో కొలెస్ట్రాల్‌కు చెక్.. డయాబెటిస్ పరార్

Surya Mudra
Surya Mudra
ప్రాణామాయాల్లో ముద్రలను అనుసరించడం ఒక పద్ధతి. పద్మాసనంలో కూర్చుని సూర్యముద్రను వేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సూర్యముద్రను రోజూ 15 నిమిషాల పాటు వేస్తే.. మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఒత్తిడి దరిచేరదు. మనస్సు ప్రశాంతంగా వుంటుంది. 
 
సూర్య ముద్ర వేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిద్రలేమి దూరం అవుతుంది. రోజూ నీరసం, నిస్సత్తువ అనిపించేవారు.. శక్తి లేనట్లు భావించేవారు. కొద్దిగా పనిచేయగానే అలసిపోయే వారు.. సూర్యముద్ర వేస్తే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంతపనిచేసినా అలసిపోరు. 
 
అంతేగాకుండా.. మూత్రాశయ సమస్యలున్నవారికి, శరీరంలో వాపులు, నొప్పులు వున్న వారికి సూర్యముద్ర ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారికి ఈ ముద్రతో ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సూర్య ముద్ర ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా బరువు నియంత్రణ, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యంగా వుండటం జరుగుతుంది.