గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By selvi
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (13:09 IST)

ధ్యానం చేస్తున్నారా? రోజూ 15 నిమిషాలు అలా కళ్లు మూసేస్తే.. కోపం కరిగిపోతుంది..

ఆధునిక జీవితం. ఉరుకులు పరుగులు. వ్యాయామానికి టైమ్ లేదు. కుటుంబీకులతో మాట్లాడేందుకూ సమయం లేదు. యాంత్రిక జీవితం... ఈ జీవితానికి అలవాటు పడిన వారు.. ధ్యానం మాత్రమైనా చేస్తే సరిపోతుందంటున్నారు ఆధ్యాత్మిక న

ఆధునిక జీవితం. ఉరుకులు పరుగులు. వ్యాయామానికి టైమ్ లేదు. కుటుంబీకులతో మాట్లాడేందుకూ సమయం లేదు. యాంత్రిక జీవితం... ఈ జీవితానికి అలవాటు పడిన వారు.. ధ్యానం మాత్రమైనా చేస్తే సరిపోతుందంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. ప్రతిరోజూ ధ్యానం చేయండి. ధ్యానం అంటే తపస్సు కాదు. ఓ పదిహేను మనసును ఒకే చోట కేంద్రీకరించే ప్రయత్నం. మనసును అలా నిలపడం చాలా ఇష్టం. కానీ సాధన చేస్తే అసాధ్యమేమీ కాదు. 
 
ఆధ్యాత్మికంగా మీలో కలుగుతున్న భావాలను గుర్తించే ప్రయత్నం చేయండి. మీ ప్రవర్తన,  మీ మాటతీరులో ఎలాంటి మార్పులు ఏర్పడుతున్నాయో గమనించండి. దీనివల్ల కొత్త ఉత్సాహం కలుగుతుంది. 
 
ఆధ్యాత్మిక మార్గంలో సాగడానికి శారీరకంగా శ్రమపడాల్సిన అవసరం లేదు. మానసిక ఒత్తిళ్లూ ఉండవు. అయినా చాలామంది రెండు రోజులు ధ్యానం చేశారో లేదో.. నాలుగు రోజులు ఆ దిశగా ప్రయత్నం చేయరు. ప్రతి ఉదయం ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే... రోజంతా ఉత్సాహంగా వుంటారు. అప్రయత్నంగానే మీలో ఓపిక, శాంత స్వభావం పెరగడం గమనించవచ్చు. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. 
 
అలాగే ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేసే సాహిత్యాన్ని చదవండి. అయితే వాటిని చదవడంతోనే వదిలేయకుండా అందులోని అంశాలను పాటించే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ఒత్తిడి, మానసిక ఆందోళనలతో నడిచే జీవన విధానంలో మార్పు ఖాయం. ఇంకా మానసిక ఆనందంతో పాటు భౌతిక ప్రయోజనాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.