సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (22:27 IST)

160 భాషల్లో విడుదలకానున్న "అవతార్-2" (video)

avathar-2
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం అవతార్. దిగ్దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ చిత్రం గత 2009లో విడుదలైంది. ఆ నాటి టిక్కెట్ ధరలతో ఈ చిత్రం సాధించిన కలెక్షన్ రికార్డులను ఇప్పటికీ ఏ ఒక్క హాలీవుడ్ చిత్రం క్రాస్ చేయలేకపోయింది. 
 
భారతీయ ఇతిహాస గ్రంథమైన రామాయణంలోని పాత్రల ఆధారంగా ఫాంటసీ చిత్రంగా రూపొందించారు. ఈ సినిమా విడుదలైన చాలా ఏళ్ళ తర్వాత దర్శకుడు కేమరూన్ దీనికి సీక్వెల్స్‌ను అనౌన్స్ చేసి విడుదల సంవత్సరాల్ని కూడా ముందుగానే తెలిపాడు. అందులోభాగంగా ఇప్పుడు ‘అవతార్ 2’ సినిమా రెడీ అవుతోంది. 
 
ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 16న ఏకంగా రికార్డు స్థాయి భాషల్లో విడుదల కానుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘అవతార్ 2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో విడుదల కాబోతోంది. ఇదో సాలిడ్ రికార్డని చెప్పాలి. ఇక నేడు (బుధవారం) ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను సినిమాకాన్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబోతున్నారు.