బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (16:33 IST)

సీతాఫలం గుజ్జులో చక్కెర కలిపి తీసుకుంటే..?

చలికాలంలో దొరికే పండ్లతో సీతాఫలం ఒకటి. సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని క్యాల్షియం గర్భిణుల ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. అలానే పిల్లల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
 
1. సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని అందులో కొద్దిగా శీకాయ పొడి, త్రిఫల చూర్ణం కలిపి తలకు రాసుకోవాలి. ఇలా చుండ్రు సమస్య తొలగిపోతుంది.
 
2. సీతాఫలం వేరును మెత్తగా నూరి అందులో కొద్దిగా నీరు కలిపి కషాయంలా చేసుకోవాలి. జ్వరంగా ఉన్నప్పుడు ఈ సీతాఫలం కషాయం తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. 
 
3. కొందరికి వేసవిలో సెగగడ్డలు వస్తుంటాయి. అలాంటి వారు వాటిని ఎలా తొలగించుకోవాలంటే.. సీతాఫలం గుజ్జులో కొద్దిగా ఉప్పు కలిపి ఆ ప్రాంతాల్లో పెట్టుకోవాలి. ఇలా రోజూ చేస్తే గడ్డలు పోతాయి. 
 
4. విరేచనాలు అవుతుంటే పచ్చి సీతాఫలాన్ని ముద్దగా చేసి అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. 
 
5. కీళ్లనొప్పులుగా ఉన్నప్పుడు సీతాఫలం ఆకులను నీళ్లల్లో మరిగించి కాపడం పెట్టుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. అలానే సీతాఫలం వేరును చిన్నచిన్న ముక్కలుగా చేసి నమిలితే దంత, చిగుళ్ళ సమస్యలు దూరమవుతాయి.