శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:48 IST)

ఐపీఎల్‌ చరిత్రలో ధోనీ కొత్త రికార్డ్.. ఏంటది?

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని నిలిచాడు. ఈ లీగ్‌లో రెండు జట్లకు ఆడటం ద్వారానే ధోనీ రూ.137 కోట్లు ఆర్జించాడు. ఇది కేవలం జట్టుతో ఒప్పందంతో వచ్చిన ఆదాయమే. అందులో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లాంటి అవార్డుల ద్వారా వచ్చిన ఆదాయం కలవలేదు.
 
ఈ జాబితాలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీని వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ ఇప్పటివరకూ రూ.131 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా ఉన్న కోహ్లి మొత్తంగా రూ.126 కోట్లు అందుకున్నాడు. 
 
ఇకపోతే, 2008 ఆరంభ సీజన్‌లో ధోనీని సీఎస్కే రూ.6 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. మూడేళ్లు రూ.6 కోట్ల చొప్పున తీసుకు ధోని.. 2011 నుంచి 2013 వరకు సీజన్‌కు దాదాపు రూ.8.2 కోట్ల చొప్పున అందుకున్నాడు. 2014, 15ల్లో సీఎస్కే తరపున.. 2016, 17ల్లో సీజన్‌కు రూ.12.5 కోట్ల చొప్పున తీసుకున్నాడు. 2018లో చెన్నై పునరాగమనం నుంచి మూడు సీజన్లకు రూ.15 కోట్లు చొప్పున తీసుకున్నాడు.