శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (14:06 IST)

యాపిల్ ఫోన్ యూజర్లకు షాక్.. గూగుల్ పే యాప్‌కు నో ప్లేస్

GPay
గూగుల్ పే యాప్‌ను చాలామంది విపరీతంగా వాడుతున్నారు. అయితే యాపిల్ ఇండియన్ యూజర్లకు మాత్రం ఈ యాప్ అందుబాటులో లేనట్లే. ఎందుకంటే.. యాపిల్ యాప్ స్టోర్‌లో గూగుల్ పేని అని సెర్చ్ చేసినా అందులో కేవలం ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లు కనిపిస్తాయి తప్ప గూగుల్ పే మాత్రం కనిపించదు.
 
అగస్టు నెలలో యూజర్లకు ఈ యాప్ మూలంగా ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ యాప్‌ను తొలగించారు. దీనిపై గూగుల్ అధికార ప్రతినిధి కూడా స్పందించారు. గూగుల్ పేను యాపిల్ యాప్‌ను యాప్ స్టోర్ నుంచి తొలగించామన్నారు. ఆగస్టులో ఈ యాప్ చాలా ఇబ్బందులు పెట్టింది. దీనిపై చాలా మంది ఇష్యూ కూడా చేశారు. అయినా గంటల్లోనే సమస్యను చక్కదిద్దాం. కానీ మళ్లీ సమస్య రావడంతో ఈ యాప్‌ను యాప్ స్టోర్ నుంచి తొలగించామని చెప్పుకొచ్చారు.
 
ఈ సమస్య నుంచి బయటపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా యాపిల్ ఫోన్‌ను వాడేవారిలో కొంతమందికి పేమెంట్ విషయంలో సమస్యలు ఎదురైయ్యాయని కొందరు వాపోయారు. దీంతో ఈ సమస్యను వీలైనంత వరకు పరిష్కరిస్తామని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు.
 
పేమెంట్ ఫెయిల్ అయిన యూజర్లు హెల్ప్ కోసం గూగుల్ పే సపోర్ట్‌ను సంప్రదించవచ్చని చెప్పుకొచ్చారు. అలాగే వీలైనంత త్వరలో ఈ గూగుల్ పే యాప్‌ను యాప్ స్టోర్‌లో ఉండేలా చేస్తామని తెలిపారు.